ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 7:10 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఢిల్లీ నాయకుల ముందు రాష్ట్ర నేతలు వణికిపోతున్నారు కేటీఆర్‌ ఘాటు విమర్శలు

అర్జున్ సమాచారం:
కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్‌ ఘాటు విమర్శలు.
కాంగ్రెస్‌, బీజేపీ రెండూ తెలంగాణకు అన్యాయం చేస్తున్న పార్టీలేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఢిల్లీ నాయకుల ముందు రాష్ట్ర నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ సంచులు మోసే పార్టీ అయితే.. బీజేపీ చెప్పులు మోసే పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  అమిత్‌ షా హైదరాబాద్‌కు వస్తే బండి సంజయ్‌ బాడీగార్డ్‌లా వ్యవహరించారని కేటీఆర్‌ విమర్శించారు. ప్రియాంక గాంధీ భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పక్కకు నెట్టేశారని ఆరోపించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్‌ కరీంనగర్‌ ప్రజల గౌరవాన్ని దిగజార్చవద్దని హితవు పలికారు. తనకంటే చిన్నవాడైన అమిత్‌ షాకు రాంచందర్‌రావు కాళ్లకు నమస్కరించడమేంటని ప్రశ్నించారు. అమిత్‌ షా తెలంగాణకు వచ్చి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయారని, రాష్ట్రానికి ఏం ఇచ్చారని కేటీఆర్‌ నిలదీశారు. ఒక్క మెట్రో ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు లేదా విద్యాసంస్థనైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే తాపత్రయపడుతున్నారని విమర్శించారు. వారానికి రెండుసార్లు ఢిల్లీకి వెళుతూ ఆయన ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’గా మారిపోయారని ఎద్దేవా చేశారు. అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేసినట్లుగా.. భూములు అమ్మే బ్రోకర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
=======================